GuidePedia


వెంకటేష్ రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన తెలుగుభామ అంజలి ఇపుడు దిగజారిపోయింది. జర్నీ 'సీమత్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అంజలి క్రేజ్ ఇపుడు అమాంతం పడిపోయింది. ఆ మధ్య అంజలి మిస్సింగ్ కేసు పిన్నీ తమిళ దర్శకుడితో విభేదాలు ఆమెను మరింత వెనుకడుగు వేసేలా చేశాయి. చూడ్డానికి బొద్దుగా ముదురు హీరోయిన్‌గా కనిపించడం కూడా ఆమెకు సమస్యగా మారింది. దీంతో అంజలికి అవకాశాలు సన్నగిల్లాయి. తెలుగులో ఒక్క స్టార్‌ హీరో సినిమాలో కూడా అవకాశాలు రాకపోవడంతో అంజలి దిగజారిపోయింది. టాలీవుడ్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డితో ఓ సినిమాలో నటించేందుకు ఈమె ఒప్పుకుందట. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డిని హీరోగా చేయాలని ఎప్పటినుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కోనవెంకట్ నిర్మాణంలో శ్రీనివాసరెడ్డితో రాజా కిరణ్ ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఇందులో అంజలిని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది
 
Top