GuidePedia

0


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా హీరోగా నటించిన చిత్రం రభస’ . కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత , ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బెల్లంకొండ సురేష్ సమర్పణలో అతని తనయుడు బెల్లంకొండ్ గణేష్ బాబు నిర్మించాడు. తమన్, సంగీతం అందించిన ఈ సినిమా విజయకచవితి సందర్భంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే యుఎస్ఎ ప్రేక్షకుల కోసం రభస ప్రిమియర్ షోవేశారు . ఆగస్ట్ 28రాత్రి జరిగిన ప్రీమియర్ షోలకు అద్భుతమైన స్పందన వచ్చింది. సుమారు 58లక్షలు రూపాయలను (96k డాలర్స్) రాబట్టినట్లు రభస ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు . 45 చోట్ల దాదాపు 100 స్క్రీన్స్ లో ప్రీమియర్ షో ప్రదర్శించారు.

Post a Comment

 
Top