GuidePedia

0

వీరిద్దరికీ బ్రేకప్ అయిందా అయ్యిందా !!

రానా - త్రిష గురించి ఇటీవలికాలంలో చాలా వార్తలు వెలుగులోకి వచ్చాయి. వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారని, పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని అప్పట్లో బాగానే ప్రచారం సాగింది. వీటిని ఈ ఇద్దరూ ఖండించడమేకాదు.. తాము మంచి ఫ్రెండ్స్‌మని అంతకుమించి ఇంకేమీ లేదని స్పష్టంచేశారు. ఇలా ఎన్నిసార్లు వాళ్లు క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగలేదు. విదేశాలకుగానీ, అవార్డ్ ఫంక్షన్లలో‌గానీ కనిపించడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ అంటూ గాసిప్స్ గుప్పుమన్నాయి. ఇదిలావుండగా కొత్త గాసిప్స్ వెలుగులోకి వచ్చింది. త్రిష- రానాలు తమ ఫ్రెండ్‌షిప్‌కు బ్రేకప్ చెప్పేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రానా ఇతర హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నాడనే నెపంతో అతనికి త్రిష బ్రేకప్ చెప్పేసిందని వార్తలు గుప్పుమనగా... మరోవైపు ధనుష్‌తో త్రిష ఫొటోలు వెలుగులోకి వచ్చిన తర్వాత రానా దూరంగా వున్నాడంటూ గాసిప్స్ వినబడుతున్నాయి. దీనికి సంబంధించి వీళ్లు చేస్తున్న ట్వీట్స్ ఇందుకు బలం చేకూరుతోంది. ఓ కథకు ఎప్పుడు మూడు కారణాలుంటాయని, నీ వైపు, ఎదుటివారి తరుపున వాదనలుంటాయి. నిజమనేది ఈ రెండిటికి భిన్నంగా ఉంటుందంటూ రానా ట్వీట్ చేశాడు. ఒక వ్యక్తిని మరిచి పోవడం చాలా సులభం... మళ్లీ అతన్ని నమ్మడం అంటూ ఉండదని త్రిష ట్వీట్ చేసింది. ఇలా డైరెక్ట్‌గా ప్రస్తావించక పోయినా, ఒకరినుద్దేశించి మరొకరు చేసుకున్న వ్యాఖ్యలేనని మీడియాలో ప్రచారం సాగుతోంది. మరి వార్తలపై ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

Post a Comment

 
Top