GuidePedia

0


కొచ్చడయాన్చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం లింగా’. ప్రముఖ దర్శకుడు కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా, టాలీవుడ్ బ్యూటీ అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో రజనీ నటన, ఫైట్స్, హీరోయిన్ల అందాలు ప్రేక్షకులను అలరిస్తాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు.అయితే రజనీకాంత్ పక్కన నటించాలనీ ప్రతి ఒక్క హీరోయిన్ ఆశపడుతుంది.. కానీ అందరికి ఆ ఛాన్స్ దక్కదు. ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి. రజినీ సినిమాలో చిన్న వేషమైనా సరే చేయడానికి ముందుకొస్తారు. అలాంటిది రజినీకాంత్ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ అంటే ఎందుకు వదులుకుంటారు. తాజాగా హీరోయిన్ త్రిష కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.లింగాసినిమాలోని ఓ ఐటెం సాంగులో నటించే అవకాశం త్రిషకు వచ్చిందట. ఆ ఆఫర్ ను త్రిష వెంటనే అంగీకరించిందట. ఈ వార్త తెలియడంతో కోలీవుడ్ హాట్, సెక్సీ హీరోయిన్లందరూ త్రిషపై గరంగరం అవుతున్నారట. మాలో ఏం తక్కువ... త్రిషలో ఏం ఎక్కువ... మాకంటే త్రిష సెక్సీగా, హాట్ గా వుంటదా?’ అంటూ బాధపడుతున్నారట కోలీవుడ్ హాట్ హీరోయిన్లు. త్వరలోనే ఈ విషయంపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొచ్చడయాన్అట్టర్ ఫ్లాప్ అవడంతో... ఈ సినిమాను ఎలాగైనా బ్లాక్ బస్టర్ గా తెరకెక్కించాలని రజినీ తెగ ఆరాటపడుతున్నాడట. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Post a Comment

 
Top