GuidePedia

0

రుద్రమదేవి ట్రైలర్ 17న రావట్లేదు !!

అనుష్క  టైటిల్ రోల్ లో రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న రుద్రమదేవిచిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను ఈ నెల 17వ తేదిన మహాశివరాత్రి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదల మరికాస్త ఆలస్యం అయ్యేలా వుందని చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రంరుద్రమదేవి’. భారీ బడ్జెట్ తో, ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గోనగన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. దురదృష్టవశాత్తు ఈ చిత్ర ట్రైలర్ కు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదని, ట్రైలర్ కోసం మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందేనని తెలిపారు. ట్రైలర్ విడుదల ఆలస్యం అవుతున్నందుకు క్షమించాలని, అన్ని పనులు పూర్తయ్యాక త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చిత్రయూనిట్ తెలియజేసారు.

Post a Comment

 
Top