GuidePedia

0

కెసిఆర్ ఫిల్మ్ సిటీలో డైరెక్టర్ గా సూపర్ స్టార్ కృష్ణ

శనివారం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో కాంటినెంటల్ ఇంటర్నేషనల్ కేన్సర్ సెంటర్ లో సి ఎం కే సి అర్ మాట్లాడుతూ  . సినీ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తామని, నాలుగైదు వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీని గొప్పగా నిర్మిస్తామని చెప్పారు. దాని బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లలో ఒకరిగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు కృష్ణను ఆయన కోరారు. హైదరాబాద్ వాతావరణం మరెక్కడా ఉండదని తెలిపారు.  ఈ సందర్బంగ కృష్ణ మాట్లాడు తూ ముప్పై ఏళ్లుగా తాను హైదరాబాద్‌లోనే ఉంటున్నానని, ఈ నగరమే తన సొంతూరన్న అభిప్రాయంతో ఉన్నానని ప్రముఖ సినీ నటుడు కృష్ణ చెప్పారు. ఇక్కడ సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే పెద్దదిగా నిర్మించదలచిన ఆ ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ ఫిల్మ్‌సిటీగా పేరుపెట్టాలని సూచించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రం 5 వేల ఎకరాలని 5 లక్షల ఎకరాలు అనడం కోసమెరుపు .

Post a Comment

 
Top