GuidePedia

0

మాదాపూర్ లో తిరుగుతున్నా పవన్ !!

విక్టరీ వెంకటేష్ , పవన్ కళ్యాణ్ కలసి నటిస్తున్న చిత్రం గోపాల గోపాల చిత్రీకరణ గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ లోని హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మాదాపూర్ ఫ్లై ఓవర్ పై పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశాలు రుపొందిచారు. ఈ షూటింగ్ లో వెంకటేష్ కూడా పాల్గొన్నారు. పవన్ లుక్ చాలా స్టైలిష్ గా ఉన్నది. వెంకటేష్ నార్మల్ లుక్ లో కనిపించారు. హిందీలో సూపర్ హిట్ అయిన ఓ మై గాడ్ సినిమా ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకి కిషోర్ పర్దసాని దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు , శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

Post a Comment

 
Top