GuidePedia

0

త్వరలో ఆది ప్రేమ పెళ్లి ?

డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడిగా తెరంగేట్రం చేసిన ఆది.. త్వరలోనే పెళ్లికొడుకు కాబోతున్నాడట. అతడి మహిళా అభిమానులకు ఇది పెద్ద షాకే అయినా.. అందుకు మరో మూడు నాలుగు నెలల వరకు సమయం ఉందన్నది మాత్రం కొంత ఊరటనిచ్చే అంశం. ఈ విషయాన్ని ఆది గానీ, అటు సాయికుమార్ గానీ ఇంతవరకు నిర్ధారించలేదు. అయితే ఫిలింనగర్ మొత్తం ఇప్పుడు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఒక అమ్మాయిని ఆది ఇష్టపడ్డాడని, ఆ పెళ్లికి ఇరువైపుల పెద్దలు కూడా అంగీకరించి పెళ్లి చేయిస్తున్నారని చెబుతున్నారు. బహుశా త్వరలోనే సాయికుమార్ ఈ అంశంపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Post a Comment

 
Top