శంకర్ 'ఐ' ఆ సినిమా కాపీనా?
ఐ సినిమా ట్రైలర్లో విక్రం వేసుకున్న జంతు వేషానికి
ప్రేక్షకులు ఫిదా
అయ్యారు. ఈ ట్రైలర్ విడుదల అయిన కొన్ని గంటల్లోనే వచ్చిన స్పందన బాలీవుడ్ సినిమాలకు
కూడా రాదనే చెప్పాలి. ఈ సినిమాలో విక్రం పాత్రకు మూలం హాలీవుడ్లో వచ్చిన బ్యూటీ
అండ్ బీస్ట్ అనే సినిమా కారణం అని , విక్రం మక్కీ టూ మక్కీ దించేశారని
టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా కాపీ కొట్టిన సినిమాలు
ఎన్ని రాలేదు. కానీ శంకర్ అభిమానులు శంకర్ కాపీ కొట్టలేదు , స్ఫూర్తి
పొందారని అంటున్నారు.ఏది ఏమైనా అపరిచితుడు తర్వాత విక్రం, శంకర్
కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే సంచనాలు సృష్టిస్తున్నది.
మొన్న చెన్నైలో విడుదలైన ఐ సినిమా ఆడియో తమిళ వర్షన్ కు మంచి స్పందన
వచ్చినది. ఈ ఆడియో వేడుకకి హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ అతిదిగా వచ్చిన విషయం
తెలిసిందే. ఈ వేడుకలో శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉన్నట్లు ఆర్నాల్డ్
అన్నారు. దాంతో శంకర్ టేకింగ్ కి ఉన్న క్రేజ్ హాలీవుడ్ వరకు పాకింది. త్వరలో
విడుదలవుతున్న తెలుగు ఆడియో వర్షన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .
అక్టోబర్ 23 న
తెలుగు వర్షన్
ఆడియో విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది . ఈ వేడుకకి హాలీవుడ్ స్టార్
జాకీచాన్ అతిదిగా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకని హైదరాబద్లోని
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Post a Comment