వీళ్ళు మళ్ళీ కలుస్తున్నారు ?
దర్శకుడు శ్రీనువైట్ల - రచయిత కోన వెంకట్ మళ్లీ కలసి
సినిమాలు చేస్తారా..? అవుననే
అంటున్నాయి ఫిల్మ్‌నగర్
వర్గాలు. ప్రస్తుతం పరిస్తితి అలాగే వుందట. ఇటీవల ‘లౌక్యం’ సినిమా ప్రమోషన్‌లో కోన వెంకట్ తన
మనసులోని మాటను బయటపెట్టాడు. శ్రీనువైట్లతో తనది పదేళ్ల సినీ ప్రయాణమని, ఇద్దరం కలిసి
పది సినిమాలు హిట్
కొట్టామని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఐతే, కొన్ని విభేదాల కారణంగానే తామిద్దరం
స్నేహ పూర్వకంగా విడిపోయామని బయటపెట్టేశాడు. శ్రీను వైట్లకి తాను లైఫ్ ఇవ్వలేదని, అలాగే తనకు
ఆయన లైఫ్ ఇవ్వలేదని కోన స్పష్టంచేశాడు. ఎవరి కష్టం వారిదేనని ఒక్కమాటలో చెప్పేశాడు.
'సత్య'తో తాను హిట్ కొడితే, 'ఆనందం' తో శ్రీను
విజయం సాధించాడని గుర్తు చేసుకున్నాడు. ఇప్పటికీ తమ మధ్య మంచి రిలేషన్ వుందని
అన్నాడు. ఈ లెక్కన చెర్రీతో శ్రీను చేయబోయే సినిమాకి కోన కూడా కలిసే అవకాశాలున్నాయని
ఇండస్ర్టీలో ప్రచారం సాగుతోంది. ఈలోగా మాటల రచయిత ప్రకటన సినీ అభిమానులను
మరోసారి ఆలోచించుకునే విధంగా చేసింది. ఏమో.. ఒకవేళ ఇది నిజమైనా
ఆశ్యర్యపోనక్కర్లేదు.
Post a Comment