అతనితో ఇలియానా పెళ్లి - ఇక సినిమాలకు బై బై
సన్న నడుము
సుందరి ఇలియానా ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేయనున్నారా? ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకొని, సంసార జీవితంలో స్థిరపడిపోనున్నారా? అవుననే అంటున్నాయి తెలుగు సినీ పరిశ్రమలోని విశ్వసనీయ
వర్గాలు. ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్
ఆండ్రూ నీబోన్‌తో కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న ఈ గోవా సుందరి పెళ్ళి అతనితో ఖరారైనట్లు తెలిసింది. మరి కొన్ని నెలల్లోనే
ఈ శుభకార్యం జరగనుందనీ, ఇక ఇలియానా సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారనీ భోగట్టా.
ఈ నవంబర్ 1కి 28 ఏళ్ళు నిండనున్న ఈ అందగత్తె తన ప్రేమ వ్యవహారాన్ని గుట్టుగా దాచకపోయినా, నిశ్చితార్థం, పెళ్ళి గురించి ఇప్పటి దాకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల షూటింగ్ పూర్తి చేసుకొని, ఆమె పెళ్ళి చేసుకోనున్నట్లు వినికిడి. అందుకే, తాజాగా కొందరు సినిమా ప్రతిపాదనతో వెళితే, ఇలియానా ఇకపై తాను సినిమాలు చేయబోవడం లేదని చెప్పినట్లు అభిజ్ఞ వర్గాల సమాచారం. మరికొద్ది నెలల్లోనే పెళ్ళి జరిగిపోనుందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ శుభవార్త ఆనందదాయకమే అయినా, సినిమాలకు ఆమె గుడ్‌బై చెప్పనున్నారన్న మాట మాత్రం అభిమానులకు రుచించని విషయమే. ఏమైనా, ఆల్ ది బెస్ట్ ఇలియానా!

Post a Comment