మెగా హీరోకి షాక్ ఇచ్చిన శృతి హాసన్ !
సౌత్ ఫిల్మ్
ఇండస్ట్రీలో తనదైన గ్లామర్ తో ముందుకు దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్. శ్రుతిహాసన్ ప్రస్తుతం నెంబర్ వన్
స్టార్ డం ఉన్న హీరోయిన్ మాత్రమే కాకుండా, సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కూడ బాక్సాపీస్ వద్ద పేరు తెచ్చుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రుతిహాసన్ ఓ
టాలీవుడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్
ఇచ్చింది. అయితే తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిర కొద్ది రోజుల్లోనే ఆ ప్రాజెక్ట్ నుండి శ్రుతిహాసన్
తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళితే శ్రుతిహాసన్ ఇప్పటికే మెగా హీరోల సరసన నటించింది. రామ్ చరణ్ తో
ఎవడు మూవీలో, అల్లుఅర్జున్ తో రేసుగుర్రం, అలాగే మెగాపవర్ స్టార్ తో
గబ్బర్ సింగ్ వంటి మూవీల్లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేసింది. దీంతో మరో మెగాహీరో అల్లుశిరీష్ సైతం శ్రుతిహాసన్ ని తన
మూవీలో హీరోయిన్ గా తీసుకోవాలని
నిర్ణయించుకున్నాడు. అల్లుశిరీష్, శ్రుతిహాసన్ కాంబినేషన్
లో ఓ మూవీ త్వరలోనే తెరకెక్కబోతుంది. అయితే
ఆ మూవీకి సంబంధించిన నిర్మాత శ్రుతిహాసన్
రెమ్యునరేషన్ వివరాలను తెలుసుకొని షాక్ అయ్యాడంట. శ్రుతిహాసన్ చెబుతున్న రెమ్యునరేషన్, తనకి ఉన్న మార్కెట్ కంటే ఎక్కువుగా ఉండటంతో హీరోయిన్ కి అంతగా ఇవ్వలేనని నిర్మాత చెప్పాడంట.
అయితే నిర్మాతని సైతం భయపెట్టేలా శ్రుతిహాసనం
చెప్పిన అమౌంట్ ఎంత అయి ఉంటుందని అనుకుంటున్నారా? దాదాపు కోటిన్నర రూపాయలను శ్రుతిహాసన్ డిమాండ్ చేసిందట. అదేమిటని అని అడిగితే.. మెగాహీరో మూవీ కాబట్టి ఆ మాత్రం
రెమ్యునరేషన్ ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే
అల్లుశిరీష్ మార్కెట్ ని చూసుకుంటే శ్రుతిహాసన్
కి ఇచ్చేది చాలా పెద్ద అమౌంట్ అని లెక్కలు వేసుకోవడంతో ఆమెని ప్రాజెక్ట్ ని తప్పించినట్టు తెలుస్తుంది.
Post a Comment