తాతకి కిడ్ని దానం చేసిన చెర్రీ !!
బాలీవుడ్‌లో
సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఐశ్వర్యారాయ్.. టాలీవుడ్‌లో నాగార్జున, అమల, తదితర సెలెబ్స్ ఆర్గాన్ డొనేషన్‌ను ప్రమోట్ చేస్తూ సేవాకార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఆ సంగతి పక్కనపెడితే
రామ్‌చరణ్ కూడా కిడ్నీ డొనేట్ చేసినట్టు లేటెస్ట్‌గా
గాసిప్స్ వస్తున్నాయ్. అయితే ఇదేదో రియల్ సోషల్
సర్వీస్ కోసం కాదనీ.. దసరా కానుకగా వస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో తాత
ప్రకాష్ రాజ్ క్యారెక్టర్‌కు చెర్రీ కిడ్నీ డొనేట్ చేసి కొత్త జీవితాన్ని అందిస్తాడని ఈ సీన్‌లో సెంటిమెంట్ మూవీకి హైలైట్ కానుందని ఇన్‌సైడ్ టాక్. ఇంతకుముందు విజేత మూవీలో కూడా చిరంజీవి పాత్ర తన కిడ్నీ
దానం చేసి కుటుంబాన్ని కాపాడినట్టే.. 'గోవిందుడు'లో చెర్రీ ఇలాంటి
మరికొన్ని త్యాగాలు చేసి తాత ప్రకాష్
రాజ్ బాబాయ్ శ్రీకాంత్‌ల మధ్య ఉన్న విభేదాల్ని పరిష్కరిస్తాడని టాక్స్ వస్తున్నాయ్. ఫస్ట్ టైం ఫుల్
ప్లెడ్జ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తున్న చెర్రీకి 'గోవిందుడు' ఎలాంటి రిజల్ట్
ఇస్తాడో మరో వారంలో తేలనుంది .
Post a Comment