GuidePedia

0

అవన్నీ గణేష్ ఫేక్ అకౌంట్స్ !!

ఇటివల సోషల్ మీడియాలో సినిమా ప్రముఖుల పేర్లతో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇతరులపై అభ్యంతర వ్యాఖ్యలు, వివాదాస్పద కామెంట్స్ చేసే ఆకతాయిల సంఖ్య పెరిగిపోతుంది. హీరోల అభిమానులు, ఇతర ప్రముఖుల అభిమానుల మధ్య చిచ్చు పెట్టేలా సోషల్ మీడియాలో ఈ ఆకతాయిలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సెగ నిర్మాత బండ్ల గణేష్ ను కూడా తాకింది. ఫేస్ బుక్ లో ఎవరో కొందరు ఆకతాయిలు ఈ నిర్మాత పేరుతో అకౌంట్, పేజిలు క్రియేట్ చేశారు. వీటితో నాకు ఎటువంటి సంబంధం లేదని ట్విట్టర్ లో బండ్ల గణేష్ పేర్కొన్నారు. నాకు ఫేస్ బుక్ లో ఎటువంటి అకౌంట్ లేదు. నా పేరుతో ఉన్న అకౌంట్స్, పేజిలు అన్ని ఫేక్. వాటిలో పోస్టులకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను బాధ్యడని కాదని తెలియజేసుకుంటున్నాను. అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Post a Comment

 
Top