GuidePedia

0

'అమ్మ' దోషిగా తేలింది !!



తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆస్తుల కేసులో శనివారం బెంగళూర్ ఆగ్రహార ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. సిబిఐ వాదనతో కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోర్టు తీర్పు నేపథ్యంలో అన్నాడియంకె కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో డిఎంకె అధినేత కరుణానిధి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అన్నాడియంకె నేతలు అక్కడికి చేరుకుని జయలలితకు మద్దతుగా నినాదాలు చేస్తూ కనిపించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే, కోర్టు ఇంకా శిక్షను ఖరారు చేయలేదని సమాచారం. తమిళనాడుకు చెందిన మంత్రులు, న్యాయవాదులు ఇంకా కోర్టులోనే ఉన్నారు. వారు బయటకు వస్తే తప్ప అసలు విషయం తెలియదని అంటున్నారు. 1996లో సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసు వేశారు. బెంగళూర్‌లోని కోర్టుకు కేసు తర్వాత బదిలీ అయింది.


Post a Comment

 
Top