GuidePedia

0


సంతానంతో అనుష్క !!

హాస్యనటుడు సంతానంతో రొమాన్స్ చేసేందుకు నటి అనుష్క సై అన్నట్లు కోలీవుడ్ టాక్. అదే  తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, అజిత్‌కు జంటగా నటిస్తున్న ఈ క్రేజీ హీరోయిన్ హాస్యనటుడు సంతానం సరసన నటించడానికి అంగీకరించారంటే నమ్మశక్యం కాని విషయమే. ఇది నిజమేనంటున్నారు కోలీవుడ్ వర్గాలు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో కూడా ఓ  హీరోయిన్‌గా తమన్న నటించనున్నారు. ఇంతకుముందు ఆర్య హీరోగా బాస్ ఎన్గిర భాస్కరన్ (నేనే అంబానీ) చిత్రాన్ని దర్శకుడు రాజేష్ తెరకెక్కించారు. తాజాగా ఆర్యతో మరో చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు రాజేష్ . బాస్ ఎన్గిర భాస్కరన్ (నేనే అంబానీ) చిత్రంలో సంతానం హాస్యపాత్రలో ముఖ్య భూమికను పోషించారు. దర్శకుడు రాజేష్ తాజా చిత్రంలోనూ ఆర్య, సంతానం కలిసి నటించనున్నారు. ఇందులో సంతానం ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఆయనకు జంటగా అనుష్క నటిస్తే బాగుంటుందని చిత్ర దర్శక నిర్మాతలు భావించారట. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేష్, నటుడు ఆర్య కలిసి నిర్మిస్తున్నారు. దీంతో దర్శకుడు రాజేష్ లింగా చిత్ర షూటింగ్ స్పాట్ కెళ్లి అనుష్కను సంప్రదించారని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

Post a Comment

 
Top