GuidePedia

0

జ్యోతి లక్ష్మిగా ఛార్మి !

హీరోయిన్ గా చేసే ఏజ్ దాటిపోయి, మదర్ గా చేసేందుకు ప్రాణం ఒప్పుకోక, ఇప్పటివరుకూ ఐటెమ్స్ తో కాలక్షేపం చేస్తూ వచ్చింది ఛార్మి.  ఆమె ఆరబోసిన అందాలను ఏరుకొని ఏరుకొని విసుగెత్తిన జనం.. ఇంకేదేనా కొత్తగా చేయి అంటుంటే..అమ్మడికి ఏం చేయాలో తెలియడం లేదు.  అప్పటినుంచి  లేడీ ఓరియెంటెడ్  మూవీస్ పై దృష్టి పెట్టింది.  ఆ స్టైల్లో చాలా మూవీస్ చేసినా  ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు.ప్రస్తుతం చార్మి.. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి కమిట్ అయింది..  ఆ మూవీ   జ్యోతి లక్ష్మి.ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోంది కదూ..  ఒకానొకప్పటి మెగా ఐటెమ్ గాళ్ ఆమె. ఆమె ను చూస్తే అప్పటి  యూత్ కు  నిద్రపట్టేది కాదు.అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ తో  అప్పటి సినిమాలకు ప్రాణవాయువైంది ఆమె . ఇప్పుడు అదే పేరుతో ఛార్మి ఈ  మూవీ చేస్తుండడంతో హాట్ టాపిక్ గా మారింది. పూరీ శిష్యుడు  ఈ మూవీని తీస్తున్నట్టు తెలుస్తోంది.. మరి ఈ మూవీ జ్యోతిలక్ష్మి జీవిత కథ ఆధారంగా తీస్తారా లేదా కేవలం టైటిల్  మాత్రమే యూజ్ చేసుకుంటారా అనేది ఇంకా తెలియదు.  ఏదేమైనా ఒక ఫేమస్ డాన్సింగ్ క్వీన్  పేరుతో వస్తున్న సినిమాలో ఛార్మి ..టైటిల్ రోల్ పోషించేందుకు  ముందుకు రావడం గొప్ప విశేషం.  జ్యోతి లక్ష్మి అంత కాకపోయినా కొద్దో గొప్పో ..ఐటెమ్ గాళ్  లక్షణాలు ఛార్మిలో కనిపిస్తుండడం ఒక విధంగా ఆమెకు అడ్వాంటేజే. చేతిలో సినిమాలు లేక వచ్చిన ప్రతీ లేడీ ఓరియెండెట్ మూవీ  చేసుకుంటూ పోతున్న ఛార్మి.. జ్యోతి లక్ష్మి  మూవీ ఏమాత్రం క్లిక్ అయినా  ఆమె జాతకం మారినట్టే.

Post a Comment

 
Top