GuidePedia

0

తన సావిత్రిని శ్రీదేవిగా మార్చాడు !!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు రోజుల క్రితమే తన కొత్త సినిమా సావిత్రిఅని దానికి  సంబందించిన టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసాడు. ఈ సినిమా కాన్సెప్ట్ టీనేజ్ లోని తమకు ఎదురైన తొలి యవ్వన అనుభూతుల ఆధారంగా తెరకెక్కించనున్నారు. కానీ అది విడుదల చేసిన రెండవరోజే వర్మకి చిన్న సమస్య వచ్చి పడింది. ఈ టైటిల్ మరియు ఈ కాన్సెప్ట్ ని పబ్లిక్ ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయకపోవడం వలన రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా టైటిల్ ని శ్రీదేవిగా మార్చాడు. అలాగే నిర్మాత అయిన నీలిమ తిరుమలశెట్టి ఇదే టైటిల్ ని తన సినిమాకి రిజిష్టర్ చేసానని తెలియజేయడం కూడా టైటిల్ మార్పుకు మరో కారణం. ఈ శ్రీదేవి సినిమా కథా సహకారం కోసం వర్మ ప్రేక్షకులను తమ టీనేజ్ లో జరిగిన అనుభవాల గురించి వర్మ టీంకి పంపితే వాటిలో కొన్నిటిని సినిమాలో పెట్టుకుంటామని కూడా తెలియజేశాడు.

Post a Comment

 
Top