GuidePedia

0


ఫ్లిప్ కార్ట్ కు ఈడి నోటిస్ - 1000 కోట్ల జరిమానా ?

ది బిగ్ బిలియన్ డే సేల్ పేరుతో ఈ నెల 6న పెట్టిన ఆఫర్ల నేపథ్యంలో ఈ-కామర్స్ జెయింట దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై వివరణ కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసు పంపించింది. ఈ సంస్థకు ఈడీ రూ.1,000 కోట్ల వరకు జరిమానా విధించవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ మిలియన్ డే సేల్ అంశంపై చాలా ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పరిశీలిస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చెప్పారు. ది బిగ్ మిలియన్ డే సేల్ పైన ఫ్లిప్‌కార్ట్ నుండి వివరణ కోరుతామని ఆమె అప్పుడు తెలిపారు. ఇప్పుడు ఈడీ ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు పంపించింది. కాగా, గతవారం భారీ తగ్గింపు అమ్మకాలతో ఫ్లిప్‌కార్ట్ పలు ఉత్పత్తులను పెట్టింది. దానికి ది బిగ్ బలియన్ డేగా పేర్కొంది. అయితే, ఇది వినియోగదారుల్ని నిరుత్సాహానికి గురి చేసింది. వారం రోజుల క్రితం (గత సోమవారం) ఉదయం 8 గంటలకు ఈ కొత్త స్కీం ప్రారంభం కాగానే లక్షలాది మంది వినియోగదారులు తమ ఆర్డర్లతో ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌కు పోటెత్తారు.


Post a Comment

 
Top