ప్రకాష్ రాజ్ కే సిగ్గులేదు అంటున్నాడు !!
నటుడు ప్రకాష్‌రాజ్
తనమీద చేసిన విమర్శలను దర్శకుడు శ్రీనువైట్ల తిప్పికొట్టారు. తనది అహంకారం కాదని.. ఆత్మాభిమానమని ఆయన
అన్నారు. ఆదివారం దర్శకుల మండలితో కలిసి మీడియాతో
మాట్లాడిన ఆయన.. నిజానికి ‘ఆగడు’ సినిమా నుంచి ప్రకాష్‌రాజ్‌ను
తప్పించడం తన అహంకారం కాదని అన్నారు. ప్రకాష్‌రాజ్ వద్ద నేర్చుకోవలసిన స్థితిలో తాను లేనని, సినిమా ఎలా తీయాలో తనకు తెలుసునని అన్నారు. ‘ప్రకాష్‌రాజ్‌కే
సిగ్గులేదని’ శ్రీనువైట్ల తీవ్రంగా వ్యాఖ్యానించారు. సంస్కారం, సంప్రదాయం అతనినుంచి తాను నేర్చుకోవాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. ప్రకాష్‌రాజ్ తన కవితను నాకు
అంకితమిచ్చారని, అందువల్ల ఆ సినిమాలో దానిని వాడుకునే
హక్కు తనకుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు - రచయిత కోనవెంకట్ వంటివారు ప్రకాష్‌రాజ్‌ని
సమర్థించడం విశేషం.
Post a Comment