GuidePedia

0

టెంపర్ షూటింగ్ వాయిదా !!

నందమూరి జానకిరామ్ అకస్మిక మరణం జూనియర్ ఎన్టీఆర్‑ను తీవ్రంగా కలచివేసింది. దీంతో ఆయన శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న టెంపర్ చిత్ర షూటింగ్‑ను 10 రోజుల పాటు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు మంగళవారం చెన్నైలో వెల్లడించాయి.  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో పవర్‑పుల్ పోలీసు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఒదిగిపొయి నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్‑గా నటిస్తుంది. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, మధురిమా బెనర్జీ‑లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 2015 సంక్రాంతికి టెంపర్ చిత్రం విడుదల చేయాలని ఆ చిత్ర యూనిట్ షూటింగ్‑ పనులను శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Post a Comment

 
Top