GuidePedia

0

నాగ చైతన్యకి టైటిల్ దొరికింది !!

ఈ మధ్య టైటిల్ లేకుండా నాగచైతన్య కొత్త సినిమా టీజర్ బయటికి వచ్చింది. అందులో టైటిల్‌పై బ్రహ్మీ సెటైర్లు కూడా పేల్చాడు. ఈ చిత్రానికి మోసగాడు, మాయగాడు వంటి పేర్లల్లో ఏదో ఒకటి ఫిక్స్ చేస్తారని కొన్ని వార్తలొచ్చాయి. అయితే తాజాగా 'దోచెయ్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. రెండురోజుల కిందట ఈ టైటిల్‌ను ఫిల్మ్‌ ఛాంబర్‌లో రిజిస్టర్ చేసినట్టు సమచారం. సుధీర్‌వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరి చివరలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కావచ్చని అంటున్నారు. ఇందులో మోసం చేసే వాళ్లని.. ఘరానా మోసంతో దెబ్బ కొట్టే యువకుడిగా నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే దీనికి 'దోచెయ్' పేరు పెట్టినట్టు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

Post a Comment

 
Top