GuidePedia


జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని అబ్బనీ తీయని దెబ్బపాట కూడా అంతే హిట్ అయ్యిందనే విషయం తెలిసిందే. తాజాగా రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్‌లో దానయ్య నిర్మించే ‘మై నేమ్ ఇజ్ రాజు’ అనే  మూవీ ముహూర్తం ఫిబ్రవరిలో జరగనుందని సమాచారం. ఇందులో సమంత హీరోయిన్‌గా తీసుకునే ఛాన్స్ వుందట. ఇదిలావుండగా అబ్బనీ తియ్యనీ దెబ్బఅనే ఐటెమ్‌సాంగ్ కోసం హీరోయిన్ అంజలి‌ని డైరెక్టర్ సంప్రదించాడట. కోటి రూపాయలు ఇస్తేనే సాంగ్ చేస్తానని చెబుతూనే కొన్ని కండిషన్లు పెట్టినట్టు వార్తలు వెలువడుతున్నాయి. చెర్రీతో కొన్ని సీన్లలో తాను కనిపించాలనే షరతు కూడా పెట్టిందని చర్చించుకుంటున్నారు. గీతాంజలిహిట్ అయినా సరైన అవకాశాలు రాని అంజలి రూల్స్‌ కు శ్రీను వైట్ల షాక్ అయ్యాడని టాక్.
 
Top