GuidePedia


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా  ( శ్రీమంతుడు అనే టైటిల్ పరిశినలో ఉంది) తెరకెక్కుతుంది.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. వేసవి ప్రారంభ సమయానికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. వేసవి చివరిలో అంటే జూన్ లేదా జులైలో సినిమా విడుదలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.

 
Top