GuidePedia

0

బాహుబలి - అమెరికా నుండి లీక్ - వాట్స్ అప్ లో షేర్

బాహుబలి' చిత్రానికి సంబంధించిన 12 నిమిషాల వీడియో ఇటీవల ఆన్ లైన్లో లీకైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో యూనిట్ మొత్తం షాకయింది. రాజమౌళి ఈ విషయమై సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేసారు. ఎడిటింగ్ డిపార్టుమెంటు నుండే వీడియో లీకైందని అనుమానిస్తున్నారు. ఈ మేరకు 10 మందిని పోసులు విచారిస్తున్నారు. త్వరలోనే ఎవరనే విషయాన్ని పసిగట్టనున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని సీసీఎస్ డీసీపీ రవివర్మ తెలిపారు. నేడో రేపు అరెస్టు ఉంటాయని సీసీఎస్ పోలీసులు అంటున్నారు. అమెరికా నుండి ఈ వీడియో లీకైందని సీసీఎస్ పోలీసులు కనుగొన్నారు. ఈ చిత్రానికి పని చేస్తున్న విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ సంస్థల్లో పని చేసే వ్యక్తులకు ఈ వ్యవహారానికి సంబంధం ఉందని తెలుస్తోంది. చిత్రంలో కీలకమైన 12 నిమిషాల వీడియోను విఎఫ్ఎక్స్ ఎడిటింగుకు ఇచ్చినపుడు ఒక వ్యక్తి దాన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేసి వాట్సాప్ ద్వారా తన స్నేహితులకు షేర్ చేసినట్లు తెలుస్తోంది.


Post a Comment

 
Top