GuidePedia

0

బ్రహ్మికి చెక్ పెట్టనున్న చిరు...?

డీ, రెడీ, దూకుడు, బాద్ షా, ఆగడు.. ఇలా శ్రీను వైట్ల చేసిన ఏ సినిమా అయిన అందులో బ్రహ్మానందం ఉండాల్సిందే. పైగా శ్రీను వైట్ల సినిమాల్లో బ్రహ్మానందం క్యారెక్టర్ హైలెట్ అవ్వడం, ఆ సినిమాల విజయంలో హీరో కంటే బ్రహ్మానందం పేరే ఎక్కువగా వినబడటం జరుగుతోంది. మహేష్ బాబు,ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో చేసిన 'దూకుడు' ‘బాద్షా’ సినిమాల విజయంలో కూడా బ్రహ్మానందం పేరే ఎక్కువగా వినబడింది. ఈ విషయాన్నిచిరంజీవి బాగానే పసిగట్టేసినట్టున్నారు. దాంతో రామ్ చరణ్ చిత్రంలో బ్రహ్మానందంని తీసుకోవడానికి వీల్లేదని చిరంజీవి అడ్డం పడ్డారని తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ  చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా బ్రహ్మానందంని తీసుకుందామనుకున్నాడట శ్రీను వైట్ల. మాములూగా బ్రహ్మానందం కోసం తను క్రియేట్ చేసే విధంగానే ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం పాత్రను అద్భుతంగా క్రియేట్ చేసాడట శ్రీను వైట్ల. అయితే ఇది హీరో పాత్రను డామినేట్ చేసే విధంగా ఉంటుందని భావించిన చిరంజీవి ఈ సినిమాలో బ్రహ్మిని తీసుకోవద్దని డైరెక్టర్ కి చెప్పినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. అందుకే ఈ సినిమాలో బ్రహ్మి స్థానంలో కోలీవుడ్ స్టార్ కమెడీయన్ సంతానంని తీసుకోవాలని శ్రీను వైట్ల భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో... ఇదే కనుక నిజమైతే ఇన్ని సంవత్సరాల వైట్ల-బ్రహ్మి బంధానికి బ్రేక్ పడినట్లే...

Post a Comment

 
Top