బాహుబలి లీక్ వీరుడు వర్మ అరెస్ట్
‘బాహుబలి’ వీడియో లీకేజ్ కేసులో పోలీసులు వర్మ అనే వ్యక్తిని ఈ రోజు అరెస్ట్ చేశారు. మకుట
విజువల్ ఎఫెక్ట్స్‑లో పని చేస్తున్న ఆయన, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో వీడియో
ఫుటేజీని దొంగిలించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ దృశ్యాలను వర్మ యూట్యూబ్‑
ద్వారా ఇంటర్‌నెట్‌లో అప్‑లోడ్ చేశాడని పోలీసులు నిర్థారణకు
వచ్చారు. బహుబలి చిత్రానికి సంబంధించి కొన్ని దృశ్యాలు లీక్ చేశారంటూ ఆ చిత్ర నిర్మాత
శోభు సీసీఎస్
పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, వర్మని అదుపులోకి
తీసుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీకి వర్మనే మేనేజర్ కావడంతో
ల్యాప్‌ట్యాప్ ద్వారా తన స్నేహితులకు ఈ వీడియోని సులభంగా పంపించాడని
పోలీసుల విచారణలో వెల్లడైంది.
Post a Comment