వీళ్ళు ముగ్గురు మళ్ళీ రెడీ అంటున్నారు !!
కొన్ని విబేధాల కారణంగా విడిపోయిన
దర్శకుడు శ్రీను వైట్ల, రచయిత కోన వెంకట్ మళ్లీ కలిసి పని చేయనున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా
నటించబోయే సినిమాకు గోపి మోహన్ తో కలిసి కోన వెంకట్ కథ, మాటలు అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మించే
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుండి ప్రారంభమవుతుంది.
రామ్ చరణ్ సరసన సమంత తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్ కోరిక
మేరకు వ్యక్తిగత అభిప్రాయాలను, విబేధాలను పక్కన పెట్టినట్టు ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా కోన వెంకట్ తెలిపారు. వెంకీ,
డీ, రెడీ, దూకుడు, బాద్ షా వంటి విజయవంతమైన సినిమాలు గోపీ మోహన్ - కోన వెంకట్, శ్రీను వైట్ల కలయికలో వచ్చాయి. బాద్షా సినిమాకి సంభందించి కొన్ని
అభిప్రాయ బేధాలతో
విడిపోయారు.
Post a Comment