GuidePedia

0

పవన్ కళ్యాణ్ తో నటించానని చెప్పిన స్టార్ హీరో కూతురు !!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుత టాలీవుడ్ టాప్ హీరో అలాంటి అయన సరసన నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? అదీ టాలీవుడ్‑ ఎంట్రీకే అటువంటి బంపర్ ఆఫర్ వస్తే ఎవరైనా తిరస్కరిస్తారా? కానీ ఓ నూతన నటి అటువంటి అవకాశాన్ని వదులుకుంది. వెతుక్కుంటూ వచ్చిన అటువంటి అవకాశాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్, సారికల రెండవ కుమార్తె శృతి హాసన్ చెల్లలు అక్షర హాసన్ వదులుకున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమా గబ్బర్‌సింగ్‌ 2లో హీరోయిన్‌గా నటించే అవకాశం అక్షరని వరించింది. అయితే  ఈ అమ్మడు ఆ బంపర్ ఆఫర్‌ని తిరస్కరించింది. టాలీవుడ్‌లో తన డెబ్యూ మూవీ అంతటి స్టార్ హీరో సరసన ఉంటే, ఇక తరువాతి సినిమాలపై భారీగా అంచనాలు పెరిగిపోతాయన్న భయాన్ని అక్షర వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతోంది. గబ్బర్‌సింగ్ పార్ట్‌ వన్‌లో అక్షర అక్క శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.

Post a Comment

 
Top