GuidePedia

0


కొత్త సినిమా కోసం కొత్త లుక్ లో

రవితేజ హీరోగా నటించనున్న సినిమాలు వరుసగా సెట్స్ పైకి వస్తున్నాయి. రెండు రోజుల క్రితమే రవితేజ నటించనున్న ‘బెంగాల్ టైగర్’ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. అయితే ఈ మూవీ లాంచ్ లో రవితేజ తన స్లిమ్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందరూ ఎప్పుడు మంచి పిజిక్ తో ఉండే రవితేజకి ఏమైంది అని అనుకున్నారు. కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం  రవితేజలో ఈ మార్పు అనుకొని చేసిందనే అంటున్నారు. రవితేజ తన తదుపరి సినిమాలోని పాత్ర కోసం ఇలా వెయిట్ లాస్ అయ్యాడని చెబుతున్నారు.అలాగే రవితేజ లుక్ టెంపరరీ మాత్రమే అని తన తదుపరి సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగానే మునుపటి రవితేజని చూడచ్చని సమాచారం. ప్రస్తుతం రవితేజ సురేందర్ దర్శకత్వంలో ‘కిక్ 2′ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్ర టీం త్వరలోనే హంపి వెళ్లనున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వేసవిలో లో రిలీజ్ కానుంది.


Post a Comment

 
Top