GuidePedia

0

చక్రి ఆఫీసు పై అర్ధరాత్రి దాడి - పోలీస్ కంప్లేంట్

స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి పేరు ఈ మధ్య తరచూ ఏదో ఒక విధంగా వార్తలలో వినిపిస్తుంది. చక్రి మరణం తర్వాత ఆస్తి పంపకాలు, చక్రి భార్య శ్రావణి మరియు కుటుంబ సభ్యుల మధ్య గొడవలతో ఈ సంగీత దర్శకుడి పేరు మీడియాలో ప్రముఖంగా వినిపించింది. అనవసరపు గొడవలతో చక్రి పరువు తీస్తున్నారంటూ అభిమానులు కలత చెందుతున్నారు. తాజాగా గత రాత్రి చక్రి ఆఫీసుపై దాడి జరిగిందంటూ చక్రి భార్య శ్రావణి, అతని సోదరుడు మహాత్ ఫిబ్రవరి 3న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేశారని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

 
Top