వర్మ కన్ను సునంద పై పడింది ??
ప్రముఖ కాంగ్రెస్ నేత శశిధరూర్ భార్య సునంద పుష్కర్
మర్డర్ మిస్టరీ రకరకాల మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సునందా పుష్కర్ జీవిత కథ నేపధ్యంలో ఓ
సినిమాని రూపొందించడానికి సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి
సునంద పుష్కర్ మృతి కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఐతే సునంద పుష్కర్
మరణం మొదట్లో సహజ మరణం అని భావించారు. ఆ తర్వాత అది అనుమానాస్పద మృతి అయ్యింది. ఇప్పుడు
తాజాగా అది హత్య అని పోలీసులు తేల్చేశారు. శశిధరూర్ భార్యగా విశేష ప్రచారం
పొందిన ఈమె అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఉదంతం కి గల కారణాలు నేటికి వెల్లడి కాలేదు. ఢిల్లీ
పోలీసులు తలలు బద్దలు కొట్టుకున్నా , ఏ చిన్న ఆధారం కూడా లభించడం లేదు. శశి ధరూర్ తో
పాటు సునంద కొడుకుని
విచారించినా ఫలితం లేదు. ఈ నేపధ్యంలో సునంద పుష్కర్ పై సినిమా తీసేందుకు
సిద్దం అయ్యారు. అయితే ఈ కేసుని పోలీసులు పూర్తి చేసిన తర్వాత అయన సినిమాని
సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది.
Post a Comment