GuidePedia

0

టెంపర్‌ 2 వస్తుందంటా !!

ప్రస్తుతం 'టెంపర్‌' చిత్రానికి  బ్లాక్ బాస్టర్ టాక్ నడుస్తోంది. మరి ఈ టాక్‌ ఫైనల్‌గా ఎంత కలెక్షన్‌ తెచ్చి పెడుతుందనేది తెలీదు కానీ ప్రస్తుతానికి మాత్రం బండ్ల గణేష్‌ నిమిషానికో సారి 'బ్లాక్‌బస్టర్‌' అంటూ సందడి చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ టైమ్‌లో ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌తో బండ్ల గణేష్‌కి విబేధాలు వచ్చాయని బాగా చెప్పుకున్నారు. ఎన్టీఆర్‌కి పారితోషికంలో కొంత ఇంకా ఇవ్వలేదని కూడా అన్నారు. అయితే ఇదంతా పక్కన పెట్టి ప్రస్తుతం ఈ సినిమా టీం సక్సెస్ ని   ఎంజాయ్‌ చేస్తున్నారు. బండ్ల గణేష్‌ వీరిద్దరితో కలిసి పార్టీ చేసుకున్న టైమ్‌లోని ఫోటోలు కూడా పెట్టాడు. అంతటితో ఆగలేదు... 'టెంపర్‌ 2'కి రెడీ అవుతున్నామని స్టేట్‌మెంట్‌ ఇచ్చేసాడు. ఇప్పటికే సినిమా చుసిన చాలా మంది ఈ సినిమాని పటాస్ 2 అని అంటుంటే బాబు మాత్రం టెంపర్‌ 2 అంటున్నాడు. ఈ సినిమాలో సీక్వెల్‌ తీయడానికి ఏమీ లేకపోయినా కానీ 'టెంపర్‌ 2' అనేసి మీడియాకి న్యూస్ పడేసాడు. దీనితో ఫాన్స్‌ కి చిన్న క్యూరియాసిటీ కలిగించాడు.

 

Post a Comment

 
Top