బోయపాటి తో బన్నీ సినిమా కన్ఫర్మ్
లెజెండ్ సినిమాతో బాలకృష్ణ కి భారీ హిట్ అందించిన
బోయపాటి శ్రీను ఆ సినిమా తర్వాత మరో సినిమా ఇంకా ఖరారు కాలేదు. ఆ మధ్య బెల్లంకొండ
శ్రీనువాస్ తో సినిమా అన్నారు కానీ అది ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. అలాగే అల్లు
అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని గత కొన్ని
రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. దర్శక హీరోల మధ్య చర్చలు ఓ కొలిక్కి
వచ్చాయి. అల్లు అర్జున్ –
బోయపాటిల సినిమా కన్ఫర్మ్ అయ్యిందని సమాచారం. ఈ సినిమా అల్లు
అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనుంది. ఎస్.ఎస్.తమన్ సంగీత
దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత
బోయపాటి సినిమా షూటింగులో పాల్గొంటారు. ‘లెజెండ్’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే సినిమా ఇదేనని
సమాచారం. త్వరలో మిగతా వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం
అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సనోఫ్ సత్యమూర్తి సినిమాలో నటిస్తున్నాడు.
Post a Comment