GuidePedia

0

ఎన్టీఆర్ కి పోటిగా వస్తున్నా కోడి

భారీ అంచనాల మధ్య ఈనెల 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా టెంపర్.  సినిమాతో అయిన  పరిశ్రమలో రికార్డులు సృష్టిద్దామని అనుకుంటున్నా ఎన్టీఆర్ కి ఓ కోడి సవాల్ గా మారిందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత రామోజీరావు , డైరెక్టర్ క్రిష్ తో కలసి నిర్మించినదాగుడు మూతల దండాకోర్సినిమాని ఎన్టీఆర్ టెంపర్ని టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం షాకింగ్ గా మారింది. తమిళంలో హిట్ అయిన ‘శైవం’ అనే సినిమాని తెలుగులో దాగుడుమూతల దండాకోర్గా రిమేక్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ తాతగా , బేబీ సారా మనువరలిగా నటిస్తున్న ఈ సినిమా చాలా బాగా వచ్చిందని ఫిలింనగర్ టాక్. ఫ్యామిలీ ప్రేక్షకులకి నచ్చే సినిమా ఇది అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సినిమా ట్రైలర్ చాలామందిని ఆకర్షిస్తున్నది. రామోజీరావు తన నిర్మాణ సంస్థ ద్వారా గతంలో తన బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం చేసిన ఎన్టీఆర్ కు పోటీగా ఇప్పుడు తన కోడిని నిలపడం హాట్ టాపిక్ గా మారింది.

Post a Comment

 
Top