చేకోడి రేటింగ్ : 3.25/5
చిత్రం : టెంపర్
బ్యానర్ : పరమేశ్వర
ఆర్ట్ ప్రొడక్షన్స్
సంగీతం : అనుప్
రూబెన్స్
కథ : వక్కంతం వంశీ
ఛాయాగ్రహణం : శ్యాం
కే నాయుడు
నిర్మాత : బండ్ల గణేష్
కథనం, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాధ్
నటినటులు : ఎన్టీఆర్,
కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, మధురిమ, సుబ్బరాజు, వెన్నెల
కిషోర్, పవిత్ర లోకేష్, అలీ, సప్తగిరి, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు
గత కొన్ని
సంవత్సరాలుగా పెద్ద హిట్ ఇవ్వడానికి ప్రయత్నించి విఫలం అవుతున్న జూనియర్ ఎన్టీఆర్
ఈ సారి ఈ మధ్య వరుస వైఫల్యాలతో గాడి తప్పినా పూరి జగన్నాధ్ తో కలసి బాక్స్ ఆఫీస్
దగ్గరకి వచ్చాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫుల్ లెంగ్త్ పోలీస్ కారెక్టర్ చెయ్యడంతో
పాటు ట్రైలర్ ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమా పై విపరీతమైన అంచనాలు మొదలైయాయి మరి
చూద్దాం ఈ సినిమా ఆ అంచనాలను ఏ మాత్రం అందుకుందో...
కథ : వైజాగ్ ట్రాన్సఫరై వచ్చిన దయ(ఎన్టీఆర్) పూర్తి
అవినీతి పోలీస్ ఆఫీసర్. అక్కడ వాల్టేర్
వాసు(ప్రకాష్ రాజ్) అనే లోకల్ డాన్ తో చేతులు కలుపి అతని అరాచకాలలో సాయం చేయటం మొదలెడతాడు. మరో ప్రక్క దయ ఓ
యానిమల్ లవర్ శాన్వి (కాజల్) తో
ప్రేమలో పడతాడు. ఓ చిత్రమైన పరిస్దితుల్లో ఓ కోరిక కోరుతుంది. ఆ కోరిక నెరవేర్చే క్రమంలో మంచి వాడిగా మారతాడు...వాసు సామ్రాజ్యాన్ని కూల దోయటం మొదలెడతాడు. అంతేకాక చివరకు తన ప్రాణాలమీదకు సైతం
తెచ్చుకుంటాడు. ఇంతకీ దయ గర్ల్ ఫ్రెండ్ కోరిన
కోరిక ఏమిటి... దయ లో మార్పుకు కారణమైన ఆ సంఘటన ఏమిటి... అసలేం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటినటులు : నటనా పరంగా ఎన్‌టిఆర్
ఎమోషన్స్ ఇంతకుముందు సినిమాల్లో చూడని
విధంగా చూపించాడు. అందరు చెప్పినట్లే ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్
ఇచ్చాడు. ముఖ్యంగా కోర్ట్ (క్లైమాక్స్) మరియు తనికెళ్ళ భరణి సీన్స్ లో మాత్రం
అదరగొట్టేశాడు. అతని స్టైల్, యాక్షన్, డాన్స్ కూడా అంతే టెంపర్‌గా వుంటుంది. ఫుల్ ఎనర్జీ అంతా ఈ చిత్రంలోనే చూపించేశాడు.
మరో హైలెట్
ఎవరూ అంటే ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేసిన పోసాని కృష్ణ మురళి. ఎప్పటిలాగ రాజా అనే మాడ్యూలేషన్ వదిలేసి...చాలా
పద్దతిగా ఓ నిజాయితి గల పోలీస్ గా, హీరోని మంచి వైపు ప్రేరేపించే పాత్రలో నిలిచారు. కాజల్
అగర్వాల్ కూడా ఇప్పటి వరకూ తన కెరీర్లో కనపించనంత గ్లామరస్ గా ఈ సినిమాలో కనిపించింది. సినిమాలో చెప్పుకోదగిన పాత్ర కాకపోయినా
ఉన్నంతలో మాత్రం చాలా మోడ్రన్ డ్రెస్సుల్లో
కనపడుతూ కుర్రకారులోని టెంపర్ ని లేపింది. ప్రకాష్ రాజ్ ఎప్పటి లాగే చేశాడు. ఎన్టీఆర్
ని డీల్ చేసేటప్పుడు ప్రకాష్ రాజ్ డైలాగ్స్ చేప్పే తీరు, నటన బాగున్నాయి. మంత్రిగా జయప్రకాష్ రెడ్డి నటించాడు.
మధురిమ, పవిత్ర లోకేష్, సూర్య, జడ్జిగా కోట శ్రీనివాసరావుతో పాటు మిగిలినవారంతా తమ పాత్రలకు అనుగుణంగా చేసేశారు. అలీ , సప్తగిరి ట్రాక్
లేకున్నా పర్వాలేదు. ఓ సన్నివేశంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా దర్శనమిస్తాడు.
సాంకేతిక వర్గం : శ్యాం కె నాయుడు డీసెంట్ ఫోటోగ్రఫీ అందించాడు. ఇక ఎడిటింగ్ ఎస్ ఆర్ శేఖర్ పని చేసారు పూరి ప్రతి సినిమాలనే
ఎక్కడా ల్యాగ్, బోర్ లేకుండా సినిమాను స్పీడుగా లాగటంతో పాత కథ అనేది
ఎక్కడా చూస్తున్నంతసేపు అనిపించదు. అనూప్
రూబెన్స్ సంగీతం పాతబాణీలు విన్నట్లుగా వుంటాయి.
పాటల్లో పసందైన సాహిత్యం లేకపోవడంతో పెద్దగా ఎట్రాక్ట్ అనిపించదు. 'దేవుడా. ఓ దేవుడా...'అంటూ చివరల్లో వచ్చే సాంగ్‌లోనే కథంతా చెప్పేస్తాడు. టెంపర్ అనే టైటిల్‌సాంగ్ సోసోగా
అనిపిస్తుంది. మణిశర్మ నేపథ్య సంగీతం బాగుంది. ఆర్ట్ పనితనం
ఫర్వాలేదు. వక్కంతం వంశి అందించిన కథ పాతదే. స్క్రీన్ ప్లే – ఎప్పటిలానే పూరి మార్క్ స్పీడ్ స్క్రీన్ ప్లే సెకండాఫ్ లో కనపడుతుంది. స్క్రీన్
ప్లే పరంగా ఎక్కడన్నా లోపం ఉందా అంటే అది
ఫస్ట్ హాఫ్, ఎందుకంటే కొన్ని చోట్ల బోరింగ్ అనిపిస్తుంది. డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా
చెప్పనక్కర్లేదు. పూరి మళ్ళీ ఎంతో కసితో రాసిన
డైలాగ్స్ బాగా పేలాయి. ఉదాహరణకి ఓ రెండు.. ‘దేశంలో జరిగే ప్రతి అవినీతికి ఈ నోటుపై ఉన్న గాంధీగారే
సాక్షి’.. ‘అందరి ముందు అమ్మాయిని రేప్ చేసింది మేమే అని అందరి ముందు
ఒప్పుకునే ధైర్యం మాకు ఉంది, మరి మీకు ఉదయం లోపు మాకు ఉరిశిక్ష వేసే దమ్ము ఉందా.?’. ఇక డైరెక్షన్ పరంగా
నటీనటుల్ని చూపించడంలో, వారి నుంచి
డిఫరెంట్ పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో, అలాగే కథలోని ఎమోషన్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు. రైటర్ గా డైరెక్టర్ గా పూరి సక్సెస్
అయ్యాడు.
ప్లస్ పాయింట్స్ :
- · ఎన్టీఆర్ – నటన , స్టైల్ డాన్స్
- · కోర్ట్ సీన్
- · పోసాని పోలిస్ స్టేషన్ సీన్
- · డైలాగులు
డ్రా బాక్స్ :
- · అలీ, సప్తగిరి ట్రాక్
- · ఫస్ట్ హాఫ్
- · లవ్ ట్రాక్
విశ్లేషణ : వాస్తవానికి క్లైమాక్స్ ట్విస్ట్ మినహాయిస్తే
కథలో కొత్తదనమేమీ లేనట్లే. ముఖ్యంగా మొన్నే వచ్చిన
పటాస్ సినిమా సైతం సేమ్ టు సేమ్ ఇదే రన్ తో ఉంటుంది. అయితే వాటికీ ఈ సినిమాకు తేడా...పూరి జగన్నాథ్ రాసిన డైలాగులు, క్లైమాక్స్ ట్విస్ట్, ఎన్టీఆర్ నటన. కరెప్టెడ్ పోలీస్ అంటే ఇలాగే ఉంటాడు అనేంతగా లీనమై చేసాడు. అలాగే మంచిగా మారినప్పుడు చూపిన
ఎమోషన్స్ ...ఎక్సప్రెషన్స్ సైతం
ఎన్టీఆర్ లోని నటుడుని పూర్తి స్దాయిలో ఆవిష్కరిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో పూరి జగన్నాథ్ తన రచనా విశ్వరూపం చూపిస్తే..ఎన్టీఆర్ తన నటనా విశ్వరూపం చూపాడనే చెప్పాలి. ముఖ్యంగా...ఎన్టీఆర్
..కరెప్టెడ్ నుంచి పూర్తిగా మారి పశ్చాత్తాపపడుతున్నప్పుడు
పోసాని సెల్యూట్ కొట్టే సీన్, అక్కడ
ఎన్టీఆర్ ఎక్సప్రెషన్స్ అద్బుతమనిపిస్తాయి.
అంతేకాదు.. క్లైమాక్స్ లో కోర్టులో మన సమాజాన్ని, న్యాయ వ్వవస్దని నిలదీస్తూ డైలాగులు అద్బుతంగా రాసాడు పూరి.
ఆ సీన్ కొంచం ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాని గుర్తుకుతెస్తుంది. అలాగే ఉరి తీసే
సీన్ లో అభిలాష సినిమా గుర్తుకు వస్తుంది. ఫైనల్ గా ఎన్టీఆర్ అభిమానులకే కాక...సినిమా
అభిమానులను సైతం అలరించే చిత్రం ఇది. కామెడీ
ఉంటేనే ఎంటర్టైన్మెంట్ అనేదాన్ని చెరపవేయటానికా అన్నట్లు కామెడీ లేకుండా వినోదం పండించి గెలిచారు.
చివరగా – ఇది ఎన్టీఆర్ దండయాత్ర...
Post a Comment