GuidePedia

0




·        చేకోడి రేటింగ్  :  2/5

చిత్రం  :  గడ్డం గ్యాంగ్    

బ్యానర్  : శివాని, శివాత్మిక మూవీస్‌  

సంగీతం  : అచ్చు   

ఛాయాగ్రహణం  : డేమిల్‌ జేవియర్‌ ఎడ్వర్డ్స్   

ఎడిటర్ : రిచర్డ్‌ కెవిన్‌   

నిర్మాత  : జీవితా రాజశేఖర్‌   

 స్క్రీన్ ప్లే,దర్శకుడు  : పి.సంతోష్‌  

నటినటులు  : రాజశేఖర్, షీన, అచ్చు, సత్యం రాజేష్, యోగ జపి,  నరేష్,  సీత,  నాగబాబు  తదితరులు


రాజశేఖర్ తన కెరీర్ లో ఎక్కువ రీమేక్ లనే నమ్ముకుంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన హిట్ అనేది కొరవడింది. దాంతో రెగ్యులర్ టోన్ కి భిన్నంగా ఓ వినోదాత్మక చిత్రంలో నటిస్తూ మన ముందుకు వస్తున్నారు. తమిళంలో విజయవంతమైన చిత్రం 'సూదుకవ్వుమ్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో 'గడ్డం గ్యాంగ్‌' పేరుతో రీమేక్‌ చేసి ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారు. చిత్రం ద్వారా సంతోష్ పి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు.

కథ :  పెద్దగా చదువుకోని గడ్డం దాసు (రాజశేఖర్).. రమేష్ (రాజేష్), సురేష్  (అచ్చు)లతో కలిసి ఒక కిడ్నాప్ గ్యాంగ్ నడుపుతుంటాడు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారిని మాత్రమే టార్గెట్ చేస్తూ.. కిడ్నాపులు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఇంకొక విచిత్రం ఏమిటంటే.. వీళ్లు చేసేది క్రైమ్ అయినా.. నిబంధనలను తగ్గట్టు నడుచుకుంటారు. అంతా సవ్యంగానే జరుగుతున్న సమయంలో.. వీళ్లు ఓ మినిష్టర్ కొడుకుని కిడ్నాప్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇందుకోసం వాళ్లు ప్లానింగ్ వేసుకుంటారు. దాని ప్రకారమే అతడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ముందుగా అందులో ఫేలయినా.. తర్వాత ఎలాగోలా సక్సెస్ అయి అతడ్ని కిడ్నాప్ చేస్తారు. కానీ.. డబ్బు లావాదేవీలతో ఈ గడ్డం గ్యాంగ్ ఇబ్బందుల్లో పడిపోతుంది. ఈ నేపథ్యంలోనే వీరిని పట్టుకునేందుకు గబ్బర్ సింగ్ అనే ఓ పోలీసాఫీసర్ దిగుతాడు. ఇక ఇతడు వాళ్ల వెంటపడటం, వాళ్లు ఇతని నుంచి తప్పించుకోవడం.. అనే కోవలో కథ నడుస్తుంది.


నటినటులు : ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించిన రాజశేఖర గురించి చెప్పుకుంటే.. తనకు కామెడీ అలవాటు లేకపోయినా.. తనవరకు ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ కొన్ని సీన్లలో అవసరమైన మోతాదులో చేశాడు. ముఖములో వయసు బాగా కనిపిస్తుంది. రాజశేఖర్ నుంచి అభిమానులు ఆశించే హీరోయిజం లేదు. సినిమా మొత్తం రాజశేఖర్ ని గడ్డంతో చూడటం కష్టమే. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో రాజశేఖర్ హీరోయిజం లేకపోవడం పెద్ద మైనస్ . హీరోయిజం కు అలావాటు పడ్డ తెలుగు ప్రేక్షకులకి రాజశేఖర్ పాత్ర ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. రాజశేఖర్ అంటే సాయి కుమార్ డబ్బింగ్ చెప్పాల్సిందే. అయితే ఈ కాంబినేషన్ సరిగ్గా వర్కౌట్ కాలేదు. డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు.
 
ఇక హీరోయిన్ పాత్రలో నటించిన షీనా నటన, గ్లామర్ లో బాగానే రాణించింది.  ఐతే ఆమె పాత్ర అంత బాగా లేదు. ఊహాసుందరి అని ఊరించారు. ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ సంగీత దర్శకుడు అచ్చు. మొదటి సినిమానే అయినా బాగా చేశాడు. డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సిందే. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమైనా ఉందంటే….అది ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ నటించిన యోగ జాపి గురించి సినిమా మొత్తం భయపెట్టించాడు. ఈయనకు ఒక్క డైలాగ్ కూడా లేదు. సెకండ్ హాఫ్ వచ్చే ఈ పాత్రా సినిమాని కాస్త రిలీఫ్. అయన పెర్ఫార్మెన్స్ తో పడిపోయిన సినిమా గ్రాఫ్ ని కాస్త పరుగెత్తించాడు. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన సత్యం రాజేష్, నరేష్ , సీత,నాగబాబు , గిరిబాబు , రఘు బాబు అలవాటైన పాత్రల్లో నటించారు.


సాంకేతిక వర్గం : తమిళంలో రికార్డ్ సృష్టించినా ఈ సినిమా ఇక్కడ అలా చేయలేకపోయింది. అందుకు కారణం పీటర్ సంతోష్ దర్శకత్వం. కథ ఒక్కటి బాగుంటే చాలదు , సినిమా ఎలా తీసినా అడేస్తుంది అనుకోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్. ఒరిజినల్ కంటెంట్ని తెలుగులో జనరేట్ చేయడంలో విఫలమయ్యాడు. మిగిలిన విభాగాల్లో లో సినిమాటోగ్రాఫీ చాలా డీసెంట్ గా ఉన్నది. లోకేషన్స్ ని బాగా చూపించాడు. ఎడిటింగ్ కూడా అంత గొప్పగా లేదు. అచ్చు సంగీతం బాగున్నది. కానీ సినిమాలో ఒక్కటి కూడా పెర్ఫెక్ట్ టైం లో పడలేదని అనిపిస్తుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా  సినిమాకి ఉపయోగపడలేదు. నిర్మాణ పరంగా రాజశేఖర్ బాగానే ఖర్చు చేశారు. కొన్ని లొకేషన్లు అందరినీ ఆకట్టుకుంటాయి.

ప్లస్ పాయింట్స్ :
·        పోలీస్ పాత్ర  
·        సినిమాటోగ్రఫీ  
·        కథ
·        కొన్ని కామెడీ పంచ్ డైలాగ్స్
డ్రా బాక్స్ :
·        సంగీతం
·        దర్శకత్వం
·        ఎంటర్టైన్మెంట్

విశ్లేషణ :  యాంగ్రీ యంగ్ మెన్ గా ఇప్పటికీ చెప్పుకునే రాజశేఖర్ కి అప్పట్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. ఇప్పుడు అతనికి అభిమానులు తగ్గినా కానీ పాత సినిమాలపై ఉన్న అభిమానంతో అతని సినిమాలు చూస్తున్నారు. తమిళంలో హిట్ అయిన సూదుకవ్వం అనే తమిళ సినిమా రైట్స్ తీసుకొని గడ్డం గ్యాంగ్ పేరుతొ తెలుగులో రీమేక్ చేసారు. అయితే డైరెక్ట్ సినిమా కంటే రీమేక్ సినిమాకే సమస్యలెక్కువగా ఉంటాయి. సూదుకవ్వం-గడ్డంగ్యాంగ్ విషయానికి వస్తే అదే జరిగింది. ఆర్టిస్టుల దగ్గరి నుంచి, టేకింగ్ వరకునేటివిటీ దగ్గరి నుంచి పబ్లిసిటీ వరకు చాలా తేడాలొచ్చాయి. రాజశేఖర్ పవర్ ఫుల్ హీరోయిజం చూపించే సత్తా ఉన్న మాస్ హీరో. అలాంటి మాస్ హీరోను ఈ సినిమాలో జీరో చేసేశారు. కనీసం తెలుగు ఆడియన్స్ కోసం ఆ పాత్రని కొంచం మార్చాల్సింది. ఈ పాత్రని అయన కాకుండా మంచి యంగ్ హీరో ఈ కథ చేసుంటే బాగుండేది. ఈ సినిమాను రీమేక్ కాకుండా డబ్బింగ్ చేసుంటే బాగుండేదనే టాక్ వినిపించింది. ఇక హీరోయిన్ షీన టైస్ చూపించడం తప్ప ఆ పాత్రకి అర్ధం లేకపోయింది. పోలీస్ డ్రెస్ వేసినప్పుడు కూడా పొట్టి నెక్కర్ వేసుకొని టైస్ చేపెడుతూ పరిగెత్తించారు. కథ బాగున్నది, ఆల్రెడీ హిట్ అయ్యింది. కానీ సీన్ టు సీన్ తీసేసి , తమిళం తెలుగు తెలిసిన వారిని పెట్టుకొని డైలాగ్స్ మక్కీ టు మక్కీ దించేసి , దాన్ని రీమేక్ అయిపొయింది అనేలా సంతోష్ అనుకున్నడేమో కానీ , ఓ తమిళ కంటెంట్ ని తెలుగు వారికీ కనెక్ట్ అయ్యేలా చెప్పాలని దర్శకుడు చేసిన ప్రయత్నం మనకు ఎక్కడా కనిపించలేదు. రాజశేఖర్ ఫాన్స్ అయితేవిడుదల అయిన ప్రతి తెలుగు సినిమాను అమితంగా చేసేవారు అయితే ఈ సినిమాని కచ్చితంగా చూడొచ్చు. అంతే కానీ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా మాత్రం కాదు.


చివరగా – గడ్డం అడ్డం తిరిగింది...

Post a Comment

 
Top