GuidePedia

0



చేకోడి రేటింగ్  :  3/5
చిత్రం  :  మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
బ్యానర్  : సి సి మీడియా & ఎంటర్టైన్మెంట్స్
సంగీతం  : గోపి సుందర్
మాటలు : సాయి మాధవ్ బుర్ర
ఛాయాగ్రహణం  : జ్ఞానశేకర్
నిర్మాత  : కే యస్ వల్లభ  
రచన,దర్శకుడు  : క్రాంతి మాధవ్  
నటినటులు  : శర్వానంద్, నిత్య మీనన్, నాజర్, పవిత్ర లోకేష్, తేజస్వి, సన  తదితరులు
రన్ రాజా రన్ హిట్ తర్వాత శర్వానంద్ , చాల కాలంగా తెలుగు తెరపై కనిపించని నిత్య మీనన్జంటగా వచ్చిన సినిమా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుఓనమాలుసినిమాతో విమర్శకుల మెప్పు పొందిన క్రాంత్ మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పైన కెఎ వల్లభ నిర్మించాడు. ఆ సినిమాకి సంభందిచిన రివ్యూ ఇప్పుడు చూద్దాం...


కథ :  రాజారాం(శర్వానంద్) ఓ రన్నర్. పేద కుటుంబంలో పుట్టిన అతనికి ఎప్పటికైనా నేషనల్ లెవల్లో రన్నింగ్ కాంపిటీషన్ లో పాల్గొని గోల్డ్ మెడల్ గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. అందుకోసం నిరంతరం ప్రాక్టీస్ చేస్తుంటాడు. అదే టైములో తన కాలేజ్ లో చేరిన ముస్లీం అమ్మాయి అయిన నజీర(నిత్యా మీనన్) కళ్ళు చూసి ప్రేమలో పడతాడు. నజీర రోజూ తన మొహం చూపించకుండా రాజారాంని పలు విధాలుగా ఆటపట్టిస్తూ, తన ప్రేమని తెలియజేస్తూ, తన లక్ష్యం చేరుకోవడానికి కావాల్సిన సపోర్ట్ ని ఇస్తుంటుంది. ఈ సపోర్ట్ తో రాజారాం తను అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడమే కాకుండా తను ఎన్నో రోజులుగా చూడాలనుకుంటున్న నజీరని చూస్తాడు. కానీ అప్పుడే కథలో ట్విస్ట్.. ఓ సంఘటన కారణంగా రాజారాం నజీర ఇద్దరూ విడిపోతారు. అసలు అంతలా ప్రేమించుకున్న వీరిద్దరూ విడిపోవడానికి గల  కారణం ఏమిటి? అలా విడిపోయిన వీరిద్దరూ ఎప్పుడు కలిసారు.?  చివరికి ఏమయ్యారు..? అనేది మిగిలిన కథ...


నటినటులు :  శర్వానంద్ ఓ మంచి నటుడు ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో తను ఇప్పటి వరకూ చేయని ఒక డిఫరెంట్ కాలేజ్ కుర్రాడి పాత్ర చేసాడు. ఇందులో తను చూపించిన హావభావాలు సింప్లీ సూపర్బ్. ఇక ముస్లీం అమ్మాయి పాత్రలో నిత్యా మీనన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఓ రకంగా వీరిద్దరూ నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పాలి, వీరిద్దరి కేమిస్త్రి సింప్లీ సుపర్బ్ . వీళ్ళిద్దరి కెమిస్ట్రీ లేకపోతే ఈ సినిమానే లేదు. వీరి తర్వాత యంగ్ హీరోయిన్స్ అయిన పునర్నవి, తేజస్విలు చేసింది చిన్న చిన్న పాత్రలే అయినా వారి పెర్ఫార్మన్స్ కథకి బాగా హెల్ప్ అయ్యింది. శర్వానంద్ కి మదర్ గా చేసిన ఆమె పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.


సాంకేతిక వర్గం :  సాంకేతిక విభాగాలన్ని దర్శకుడికి బాగా సహకరించాయి. ప్రేమ కథలో మంచి ఫీల్ రావడం కోసం సంగీతం, సినిమాటోగ్రఫీ ముఖ్య పాత్ర పోషించాయి. గోపి సుందర్ ఈ చిత్రానికి ఇచ్చిన పాటలు బాగున్నాయి అనిపిస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దానికి రెట్టింపు స్తాయిలో ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కూడా సూపర్. వైజాగ్ అందాలని చకగా చూపించాడు. సాయి మాధవ్ బుర్ర మరోసారి తన మాటలతో ఆకట్టుకున్నాడు. అయన దొరకడం ఓ విధంగా తెలుగు సినిమా అదృష్టం. ఈ సినిమాని కేవలం అతని డైలాగ్స్ కోసమే చూడొచ్చు. ఓనమాలు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన క్రాంతి మాధవ్ మంచి క్లాస్ దర్శకుడిగా మంచి పేరు వస్తుంది. ఇక కే యస్ రామారావు సినిమాని మంచి రిచ్ గా తెరకెక్కించాడు.


ప్లస్ పాయింట్స్ :
·        హీరో,హీరోయిన్  
·        మాటలు
·        సినిమాటోగ్రఫీ  
·        సంగీతం
డ్రా బాక్స్ :
·        కథ
·        స్లో నేరేషన్



విశ్లేషణ :  శర్వానంద్ నిత్యా మీనన్ జంటగా నటించిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుసినిమా మీ మనసుకి నచ్చే ఓ ఫీల్ గుడ్ లవ్ స్టొరీ. ఈ సింపుల్ లవ్ స్టొరీలోని ఫీల్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో క్రాంతి మాధవ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక స్క్రీన్ ప్లే ని ఫస్ట్ హాఫ్ లో బాగా రాసుకున్నా సెకండాఫ్ లో ఎక్కడో ఆ ఫ్లో మిస్ అయినట్టు అనిపిస్తుంది. దానికి కారణం సెకండాఫ్ లో ఎక్కువ ఎమోషనల్ సన్నివేశాలే రాసుకోవడం. వాటిల్లో కొన్ని బాగా కనెక్ట్ అయినా కొన్ని మాత్రం మనకు క్లాస్ పీకినట్టు అనిపిస్తాయి. ఇకపోతే సినిమాలో హీరో ఒక రన్నర్, అతను నేషనల్ లెవల్ లో జరిగే పోటీలలో పాల్గొంటున్నాడు. అంటే ఆ పోటీలు కాస్త రియలిస్టిక్ గా ఉండాలి, అలాగే ఈ పోటీలు ఆడియన్స్ లో ఆసక్తిని పెంచాలి కానీ ఈ రెండు ఆ రన్నింగ్ ఎపిసోడ్స్ లో మిస్ అయ్యాయి. అలాగే సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లను మీరు ముందే ఊహించేయవచ్చు. అలాగే చాలా చోట్ల సెకండాఫ్ లో అలా మొదలైంది సినిమా ఫ్లేవర్ కనిపిస్తుంది. ఈ సినిమా అటు బ్యూటిఫుల్ రొమాంటిక్ ఫీలింగ్ ని మీలో కలుగజేస్తూనే, మీ పెదవుల పైన చిరునవ్వు ఉండేలా ఓ హ్యూమర్ టచ్ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఈ ఫీల్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. సెకండాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయి. వీటన్నిటికీ మించి సాయి మాధవ్ బుర్రా రాసిన వండర్ ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్ డైలాగ్స్, గోపి సుందర్ వినసొంపైన మ్యూజిక్, కళ్ళకు ఒక దృశ్య కావ్యంలా అనిపించే జ్ఞానసేఖర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రాణం పోశాయి. కానీ ఈ సినిమా మరీ క్లాస్ గా ఉండడం వలన ఎక్కువగా మల్టీ ప్లెక్స్ మరియు ఎ సెంటర్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బి,సి మెచ్చే రెగ్యులర్ ఫార్మాట్ కామెడీ, స్టొరీ ఇందులో లేకపోవడం వలన వాళ్ళకి పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. సినిమా నిదానంగా ఉన్నా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ కాబట్టి ఈ సినిమాని మీరు హ్యాపీగా చూడొచ్చు..

చివరగా – మళ్ళీ మళ్ళీ చూడొచ్చు...

Post a Comment

 
Top