సౌత్ పీకే లో కమల్ !!
విశ్వనాయకుడు కమల్‌హాసన్ మరో విలక్షణ పాత్రలో
కనిపించనున్నారు. బాలీవుడ్ సెన్సేషన్ మూవీ అమీర్‌ఖాన్
‘పీకే’ సౌత్ వెర్షన్‌లో కమల్‌హాసన్ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ‘పీకే’ సినిమా రీమేక్ కోసం సౌత్ నుంచి పలువురు నిర్మాతలు పోటీపడినప్పటికీ చివరకు ఎప్పుడు రాజ్ కుమార్
హిరాని సినిమాలు తీసుకునే జెమిని ప్రొడక్షన్సే ఈ సారి కూడా దీని రైట్స్ ని
చేజిక్కించుకుందని సమాచారం. తమిళ, తెలుగు ద్విభాషా
చిత్రంగా సెట్స్ కు వెళ్ళే ఈ మూవీ, ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ మొదలైనట్టు కోలీవుడ్ టాక్. అన్నీ అనుకున్నట్టుగా
జరిగితే మే నుండి రెగ్యులర్‌గా షూటింగ్ జరగనుంది.
ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా స్క్రిప్ట్ రెడీ అవుతోందని, ఇతర కాస్టింగ్ టెక్నీషియన్స్
ఎంపికలో ఆయన నిమగ్నమైనట్టు చెబుతున్నారు.
దీనికి సంబంధించి త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Post a Comment