GuidePedia

0

లీక్ : బాహుబలి వీడియో తర్వాత రుద్రమదేవి ఆడియో

ప్రభాస్, యస్ యస్ రాజమౌళిల 'బాహుబలి' సినిమా దృశ్యాలు లికేజి ఘటన మరవకముందే మరో లీకేజీ కలకలం తెలుగు సినిమా పరిశ్రమకు షాక్ లా తగిలింది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రుద్రమదేవి'  సినిమా ఆడియో లీకైనట్టు అంతటా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆడియో బయటకు ఎలా లీకయిందో తెలుసుకునేందుకు సినిమా యూనిట్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా 'బాహుబలి'కి సంబంధించిన 13 నిమిషాల నిడివిగల ఎడిట్ చేసిన సినిమా లీకైన అవటం నుంచి తేరుకోక మునుపే ఈ సంఘటన అందరినీ షాకయ్యేలా చేస్తోంది. బాహుబలి కేసులో మకుట విజ్‌వల్‌ సంస్థలో విజువల్స్‌ ఎఫెక్ట్‌ మేనేజర్‌గా పనిచేసిన వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు 'అత్తారింటికి దారేటి' సినిమా విడుదలకు ముందే సినిమా మొత్తం లీకవడంతో సంచలనం రేగింది. ఇలా పెద్ద సినిమాలు విడుదలకు ముందే బయటకు లీకవుతుండడం పట్ల ఆయ చిత్రాల నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

Post a Comment

 
Top