GuidePedia

0

బాలయ్య ఏం చేస్తాడో చూడాలి !!

టెంపర్ మూవీ హిట్ అవ్వడంతో అబ్బాయి ఎన్టీఆర్  బాబాయి బాలకృష్ణకు సవాల్ విసిరాడనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి టెంపర్ మూవీకి, బాలయ్యకి  ఏ విధమైన సంబంధం లేదు. మరి ఇక సవాల్ విసిరే ఛాన్స్ ఎక్కడిది అని ఓ సందేహం రావచ్చేమో! అయితే రీల్ కొంచెం రివర్స్ చేస్తే... టెంపర్ మూవీ ఆడియో లాంచ్ టైమ్‌లో.. ఈ సినిమా తప్పకుండా హిట్టయి తీరుతుందని ధీమా వ్యక్తంచేసిన అబ్బాయి కళ్యాణ్ రామ్.. '' ఈ సంవత్సరం తమ నందమూరి ఫ్యామిలీదే అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాకుండా... తాను నటించిన 'పటాస్', తమ్ముడు నటించిన 'టెంపర్', ఆ తర్వాత రాబోతున్న బాలయ్య బాబాయి సినిమా 'లయన్'.. ఇవన్నీ మూడక్షరాల టైటిళ్లే. ఈ మూడు బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అని కాస్త గట్టిగానే చెప్పాడు కళ్యాణ్ రామ్. అబ్బాయిలిద్దరూ ఆశించినట్లుగానే 'పటాస్' హిట్టయింది. ఆ తర్వాతే వచ్చిన టెంపర్ మూవీ ఫస్ట్ డేనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అన్నాదమ్ముళ్లిద్దరు చెప్పిన మాట ప్రకారం ఇక మిగిలిందల్లా... బాబాయి హీరోగా రానున్న లయన్ గర్జించడమే. అబ్బాయిల రెండు సినిమాలు హిట్టయిన నేపథ్యంలో 'లయన్' తప్పనిసరిగా హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని సినీవిమర్శకులు విశ్లేషిస్తున్నారు.

Post a Comment

 
Top