GuidePedia

0

ఇక జూనియర్ ని సీనియర్ గా చుడమంటున్నాడు

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ..జూనియర్ ఎన్టీఆర్‌‌‌ని మళ్ళీ ఆకాశానికేత్తేశాడు. శుక్రవారం తెల్లవారుజామున ఐదుగంటలకే దర్శకుడు రాజమౌళితో కలిసి తాను భ్రమరాంబ థియేటర్లో టెంపర్ సినిమా చూశాడట..ఇంకేం..జూనియర్ని, పూరి జగన్నాథ్‌‌ని ప్రశంసలతో ముంచెత్తాడు. ఇవాళ తెల్లవారుజామునే టెంపర్ మూవీ చూశా... తారక్, జగన్ (పూరి జగన్నాథ్)ల కాంబోను ఇదివరకెప్పుడూ నేను చూడలేదు..ముప్పయ్ ఏళ్ళలో ఇలా చూడడం ఇదే మొదటిసారి..ఇక జూనియర్ ఎన్టీయార్‌‌ని సీనియర్ ఎన్టీయార్‌‌గా, సీనియర్ ఎన్టీయార్‌‌ని జూనియర్ ఎన్టీయార్‌‌‌గా వ్యవహరిస్తే బాగుంటుంది.అబ్బో..జూనియర్లో విద్యుత్ తరంగాలు ప్రవహిస్తున్నట్టు ఉంది. వక్కంతం వంశీ, అనూప్ రూబెన్స్, శ్యాం కె.నాయుడు ఈ సినిమాని బ్రహ్మాండంగా రూపొందించారు. పూరి కెరీర్‌‌లో ఇదే బెస్ట్ మూవీ.. టెంపర్ సినిమా జూనియర్ కెరియర్ లో బెస్ట్ మూవీగా మారిపోతుందంటున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ డాన్స్‌ లు చూస్తుంటే తనకు ఫ్యాన్స్‌ తో కలిసి చిందేయాలనిపించిందంటూ పూరి, ఎన్టీఆర్‌ లను పొగుడుతూ ట్వీట్‌ చేశాడు.

Post a Comment

 
Top