ఛార్మితో ఎఫైర్ పై పూరి !!
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ త్వరలో చార్మింగ్
బ్యుటి చార్మితో ‘జ్యోతిలక్ష్మి’ అనే సినిమా
చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై కొంతకాలంగా వీరి మధ్య
స్క్రిప్టు చర్చలు జరుగుతున్నాయి. ఇందు కోసం తరచూ వీరిద్దరూ మీటవుతున్నారు. అయితే ఈ అంశాన్ని ఫిల్మ్ నగర్లో కొందరు మరోలా ఫోకస్ చేస్తున్నారు.పూరి-ఛార్మిల
మధ్య ఎఫైర్ నడుస్తుందని ప్రచారంలోకి తెచ్చారు ఈ విషయం అటు ఇటు వెళ్లి
పూరి చెవిలో పడింది. ఈ విషయమై పూరి జగన్నాథ్ స్పందిస్తూ...‘ఇలాంటి
వార్తలు ఈ మధ్య నేనూ విన్నాను. ఇవి విన్నప్పుడల్లా
నవ్వొస్తుంది. చార్మి నేను త్వరలో చేయబోయే జ్యోతిలక్ష్మిలో
హీరోయిన్ అనే విషయం అందరికీ తెలుసు. ఈ విషయమై మేము కలిసినంత మాత్రాన
ఇద్దరి మధ్య ఎఫైర్ అంటగట్టేస్తున్నారు. చార్మి నాకు చాలా కాలంగా తెలుసు, ఇద్దరం కలిసి
గతంలో పలు చిత్రాలకు పని చేసాం. మంచి స్నేహితులం. మా మధ్య
స్క్రిప్టు చర్చలు తప్ప మరేమీ జరుగడం లేదు' అని స్పష్టం
చేసారు. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘బుడ్డా హోగా
తెర బాప్' చిత్రంలో చార్మి నటించిన సంగతి
తెలిసిందే. పూరి ఛార్మి సినిమానే కాక వరుణ్ తేజ్ తో కూడా ఓ సినిమా ఉండబోతున్నట్లు
నిన్న ప్రకటించారు. ఇక అయన కొత్త సినిమా టేoపర్
ఈ నెల 13న విడుదల కానుంది.
Post a Comment