మహేష్ ని రీప్లేస్ చేస్తున్న ఎన్టీఆర్ !
ఒక హీరో
తిరస్కరించిన కథను మరో హీరో అంగీకరించడం చాలా సహజం. ఆ విధంగా ఆ మధ్య మహేష్
బాబు తిరస్కరించిన ఓ కథను ఈ మధ్య ఎన్టీఆర్ అంగీకరించాడని సమాచారం. విషయంలోకి
వస్తే.. ‘శివం’
అనే టైటిల్ తో దర్శకుడు క్రిష్ ఓ కథ
తయారు చేసుకున్నాడనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఆ కథ
అశ్వనీదత్ కి నచ్చడంతో, ఆయన నిర్మించాలనుకున్నాడనే వార్త కూడా ప్రచారం అయ్యింది.
అయితే.. ఆ కథలో మహేష్ బాబు కొన్ని మార్పులు సూచించాడట. ఆ విధంగా ఆ చిత్రం
షూటింగ్ పట్టాలెక్కలేదు. పోనీ.. వేరే ఏదైనా కథ తీసుకొస్తే
ఆలోచిస్తానని అశ్వనీదత్ తో మహేష్ బాబు అన్నాడట. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ కథను ఎన్టీఆర్
కు చెప్పాడట క్రిష్. ఈ కథ ఎన్టీఆర్ కు నచ్చడంతో…
నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వినికిడి.
ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించనున్నాడని టాక్. ప్రస్తుతం
హిందీ చిత్రం ‘గబ్బర్’కి దర్శకత్వం వహిస్తున్నాడు క్రిష్. పూరి
జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
చిత్రాలు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్, క్రిష్ కాంబినేషన్లో చిత్రం మొదలవుతుందట.
Post a Comment