GuidePedia

0

బాహుబలి 1 లో అనుష్క లేదా ??

ప్రభాస్ హీరోగా యస్ యస్  రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నా ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ మొదటి భాగంలో అనుష్క ఉండదంటూ  మీడియాలో గత కొన్ని రోజుల నుండి కొన్ని వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం ప్రభాస్, అనుష్క, రానాలు ‘బాహుబలి’ పార్ట్ 1 మరియు పార్ట్ 2లలో కనిపిస్తారని చెబుతున్నారు. ఏప్రిల్ 17న విడుదల కానున్న ఈ సినిమాకు త్వరలో ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. పబ్లిసిటీ స్టార్ చేసిన తర్వాత అన్ని విషయాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ‘బాహుబలి’ మేకింగ్ వీడియో లీక్ కావడంతో నిర్మాతలు సినిమాకు సంబందించిన ఏ ఒక్క విషయాన్నీ బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాపై మీడియాలో రోజుకొక వార్త బయటకోస్తున్నా స్పందించడం లేదు.

Post a Comment

 
Top