అర్దరాత్రి తాగి గొడవ చేసిన రామ్ చరణ్ !!
అర్ధరాత్రి ఓ మెగాహీరో
మద్యం మత్తులో గొడవ చేశాడంటూ పలు న్యూస్ చానళ్లలో
వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఆ యువహీరో
ఎవరో కాదని.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ అంటూ ఓ చానల్ వార్తను ప్రసారం చేసింది. రాంచరణ్‌తోపాటు విజయవాడ
మాజీ ఎంపీ లగడపాటి కుమారుడు, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుమారుడు కూడా ఉన్నట్లు ఆ టీవీ చానల్‌లో వార్త కథనాలు ప్రచురితమయ్యాయి.
మద్యం మత్తులో వీరంతా ఓ ఐపీఎస్ అధికారి
ఇంటివద్ద గొడవ చేశారని సమాచారం. అయితే గతంలోనూ రాం చరణ్ నడి రోడ్డుపై వాహనదారులతో గొడవపడటం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు ఓ చానల్ ప్రసారం
చేసినట్లు రాంచరణ్ నిజంగానే ఆ గొడవ చేసి
ఉంటే అది మెగా ఫ్యామిలీ ప్రతిష్టకు దెబ్బవంటిదనే చెప్పవచ్చు. ఇక ఈ వార్తపై మెగా ఫ్యామిలీ ఇంకా స్పందించలేదు.
Post a Comment