GuidePedia

0

సన్నీ లియోన్ కోసం 1.25 కోట్లు ఖర్చు చేసాడు

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కు బాలీవుడ్లోనే కాక దక్షిణాదిలోనూ డిమాండ్ పెరిగిపోతోంది. సన్నీ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్న నిర్మాతలు ఆమె పాటలను కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి చిత్రీకరిస్తున్నారు. తెలుగు చిత్రంలో కరెంట్ తీగలో సన్నీ చిందేస్తున్న ఓ పాట కోసం ఏకంగా 1.25 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మంచు మనోజ్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, మరో్ హీరో జగపతి బాబు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 17న ఈ సినిమా విడుదల కానుంది. కరెంట్ తీగను హిందీలో కూడా డబ్ చేయనున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే సన్నీ పాటను నేషనల్ మ్యూజిక్, వినోదాత్మక చానెళ్ల ద్వారా విడుదల చేయనుండటం విశేషం.

Post a Comment

 
Top